![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `రాజా ది గ్రేట్` ఒకటి. ఇందులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే అంధుడి పాత్రలో తనదైన అభినయంతో అలరించారాయన. ఇక ఇదే సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ అంకాన్ని విజయవంతంగా పూర్తిచేశారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. 2017లో విడుదలైన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు రవితేజ, అనిల్ రావిపూడి మధ్య గత కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయని టాక్.
ప్రస్తుతం రవితేజ `ఖిలాడి`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఆపై శరత్ మండవ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా.. త్రినాథరావ్ నక్కిన కెప్టెన్సీలో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయనున్నారు. ఇక అనిల్ రావిపూడి విషయానికొస్తే.. ప్రస్తుతం తన చేతిలో `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` ఉంది. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న `ఎఫ్ 3` ఆగస్టు 27న థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణతోనూ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
సో.. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే అంటే 2022 చివరలో `రాజా ది గ్రేట్` సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.
![]() |
![]() |