![]() |
![]() |

`ఎవడే సుబ్రమణ్యం`, `మహానటి` చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్.. హ్యాట్రిక్ వెంచర్ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఆ సినిమానే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్న పేరు నిర్ణయించని పాన్ - వరల్డ్ మూవీ. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ హై బడ్జెట్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే.. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఈలోపు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే దిశగా నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ప్రణాళిక రచిస్తోందట. త్వరలోనే ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొణే నటించనున్న ఈ సినిమాలో `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చనున్నారు. 2023లో ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |