![]() |
![]() |

కరోనా టైమ్స్ లో ఓటీటీ ట్రెండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించిన కొన్ని చిత్రాలు సైతం ఓటీటీలో నేరుగా సందడి చేశాయి. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత నాలుగు నెలల్లో థియేట్రికల్ రిలీజెస్ సందడి నడిచినా.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తమిళనాట రెండు ఆసక్తికరమైన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఓటీటీ బాట పట్టబోతున్నాయి. ఆ చిత్రాలే.. 'రాంగి', 'నేట్రికన్'.
త్రిష ప్రధాన పాత్రలో ఎ.ఆర్. మురుగదాస్ రచనతో తెరకెక్కిన 'రాంగి'.. ప్రముఖ ఓటీటీ వేదిక 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమ్ కానుందని కోలీవుడ్ బజ్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి 'జర్నీ' ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.
ఇక నయనతార ముఖ్య పాత్రలో నటించిన 'నేట్రికన్' మరో ప్రముఖ ఓటీటీ వేదిక 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమ్ కానుందని సమాచారం. 'గృహం' (సిద్ధార్థ్ హీరో) దర్శకుడు మిళింద్ రావ్ రూపొందించిన ఈ చిత్రాన్ని నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మించారు. ఇందులో నయన్ అంధురాలి పాత్రలో దర్శనమివ్వనున్నారు. త్వరలోనే 'నేట్రికన్' స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ రానున్నది.
మరి.. వేర్వేరు ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ కానున్న ఈ థ్రిల్లర్ మూవీస్‌తో.. త్రిష, నయన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |