![]() |
![]() |

`గౌతమీపుత్ర శాతకర్ణి`తో నటుడిగా వంద సినిమాలను పూర్తిచేశారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `అఖండ` ఆయన 106వ చిత్రం. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఆపై 107వ చిత్రాన్ని `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేయబోతున్నారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. మే నెలాఖరులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు.
ఇక 108వ సినిమా విషయానికి వస్తే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. `కృష్ణార్జున యుద్ధం`, `మజిలీ`, `టక్ జగదీష్` నిర్మాతలు - షైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారని టాక్. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న వెల్లడించనున్నట్లు తెలిసింది.
మరి.. వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన అనిల్ రావిపూడి.. `#NBK 108`ని ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తారో చూడాలి.
![]() |
![]() |