![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' వంటి సక్సెస్‌ఫుల్ వెంచర్ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో నాని చేసిన సినిమా ఇది. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే.. శివ గత చిత్రాలకు భిన్నంగా మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన 'టక్ జగదీష్'లో కథానుసారం ఓ స్పెషల్ సాంగ్ కి కూడా స్థానముందట. అందులో ఓ స్టార్ హీరోయిన్ చిందులేసిందని టాక్. అయితే, ఆ నాయిక ఎవరన్న విషయం మాత్రం వెలుగులోకి రాలేదు. మరి.. ఈ స్పెషల్ డాన్స్ నంబర్ 'టక్ జగదీష్'కి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి. కాగా, ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన 'టక్ జగదీష్' కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదిని ప్రకటించనున్నారు.
'జెర్సీ' లాంటి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం తర్వాత చేసిన 'నానీస్ గ్యాంగ్ లీడర్', 'వి' సినిమాలు ఆశించిన మేర ఆడకపోవడంతో టక్ జగదీష్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నాని.
![]() |
![]() |