![]() |
![]() |

తమిళంలో 'ఇరుది సుట్రు', హిందీలో 'సాలా ఖడూస్' పేర్లతో రూపొందిన బైలింగ్వల్ మూవీతో కెప్టెన్‌గా తొలి సక్సెస్‌ని చూశారు తెలుగమ్మాయి సుధ కొంగర. ఆపై అదే చిత్రాన్ని 'గురు' పేరుతో రీమేక్ చేసి.. విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో విజయాన్ని అందుకున్నారు. ఇక గత ఏడాది చివరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయిన సూర్య సినిమా 'సూరారై పోట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా')తో మరోమారు సినీ ప్రియులను, విమర్శకులను విశేషంగా ఆకర్షించారు సుధ. ఈ నేపథ్యంలో.. సుధ తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది.
తాజా కథనాల ప్రకారం.. ఇద్దరు స్టార్స్ తో సుధ తన నెక్స్ట్ వెంచర్స్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ స్టార్స్ మరెవరో కాదు.. 'తల' అజిత్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. తొలుత అజిత్ కాంబినేషన్ మూవీ చేసి.. ఆపై మహేశ్ కాంబోలో సినిమా ప్లాన్ చేస్తున్నారట సుధ. ఈ లోపు అజిత్ 'వాలిమై'ని - మహేశ్ `సర్కారు వారి పాట`, త్రివిక్రమ్ డైరెక్టోరియల్‌ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో చేయాల్సిన ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుండడంతో.. ఆ గ్యాప్‌లో సుధ కొంగర డైరెక్టోరియల్ చేసేందుకు మహేశ్ ప్రణాళిక రచించారని టాక్. మరి.. ఫస్ట్ అజిత్ - నెక్స్ట్ మహేశ్ అంటూ ముందుకు సాగుతున్న సుధ.. ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |