![]() |
![]() |

తెలుగునాట కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ చూసి చాలా కాలమే అయింది. దాదాపు నాలుగేళ్ళ క్రితం విడుదలైన `రారండోయ్ వేడుక చూద్దాం` (2017) తరువాత.. రకుల్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడనే లేదు. `జయ జానకి నాయక`, `స్పైడర్`, `ఎన్టీఆర్ కథానాయకుడు` (స్పెషల్ రోల్), `మన్మథుడు 2`, `చెక్`.. ఇలా రకుల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. `దేవ్`, `ఎన్జీకే` లాంటి అనువాదాల సంగతి సరేసరి. ఉన్నంతలో `ఖాకి` ఫర్లేదనిపించుకుంది.
ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రంపైనే తన ఆశలు పెట్టుకుంది రకుల్. ఆ సినిమానే.. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన నవలాధారిత చిత్రం. `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీలో డి-గ్లామర్ రోల్ లో నటించింది రకుల్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. `ఉప్పెన`తో వైష్ణవ్ సెన్సేషనల్ డెబ్యూ ఇవ్వడంతో.. అతని కాంబినేషన్ తోనైనా సక్సెస్ చూస్తానన్న ఆశాభావంతో ఉంది రకుల్. మరి.. రకుల్ ని చాన్నాళ్ళుగా ఊరిస్తున్న `హిట్`.. వైష్ణవ్ సినిమాతోనైనా దక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |