![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ ధనుష్ కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది `కర్ణన్` సినిమా. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. ``తన ఊరి ప్రజల హక్కులను కాపాడేందుకు ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడు?`` అనే పాయింట్ తో `కర్ణన్` తెరకెక్కగా.. టైటిల్ రోల్ లో ధనుష్ అభినయం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. మొత్తంగా.. `కర్ణన్`తో ధనుష్, మారి సెల్వరాజ్ కాంబినేషన్ పై తమిళనాట ఎనలేని క్రేజ్ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే.. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు.. తాజాగా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశాడు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఎందుకంటే.. ప్రస్తుతం ధనుష్ చేతిలో `ద గ్రే మ్యాన్` అనే హాలీవుడ్ మూవీతో పాటు కార్తిక్ నరేన్ డైరెక్టోరియల్ కూడా ఉంది. ఇక మారి సెల్వరాజ్ కూడా ధ్రువ్ విక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి ఈ సంవత్సరం పూర్తవుతుంది. సో.. వచ్చే ఏడాదే ధనుష్ - మారి సెల్వరాజ్ సెకండ్ జాయింట్ వెంచర్ సెట్స్ పైకి వెళుతుందన్నమాట. మరి.. `కర్ణన్`లాగే రాబోయే సినిమాతోనూ ఈ ద్వయం.. సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |