![]() |
![]() |

సీనియర్ నాగార్జున టైటిల్ రోల్ పోషించిన 'వైల్డ్ డాగ్' మూవీ ఏప్రిల్ 2న విడుదలైంది. రైటర్ అహిషోర్ సాల్మన్ డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలైతే లభించాయి కానీ, ఆడియెన్స్ నుంచి ఆదరణ దక్కలేదు. దాంతో నాగ్ కెరీర్లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించారు.
రెండు రోజుల క్రితం 'వైల్డ్ డాగ్' ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యింది. దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబ్ బ్లాస్టుల నేపథ్యంలో రూపొందడం, వాటి వెనుక ఉన్న టెర్రరిస్టుల ముఠాను పట్టుకోవడానికి తన గ్యాంగ్‌తో ఏసీపీ విజయ్‌వర్మ వీరోచిత విన్యాసాలు చేయడం ప్యాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రధానంగా ఒళ్లు గగుర్పాటు పొడిచేలా ఉండే యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. అందుకే థియేటర్లలో రాని రెస్పాన్స్ ఓటీటీలో కనిపిస్తోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఇండియాలోనే సెకండ్ పొజిషన్లో నిలబడింది 'వైల్డ్ డాగ్'. నిన్న అయితే టాప్ పొజిషన్లో ఉంది.
ఓటీటీలో 'వైల్డ్ డాగ్' సౌత్‌లోని నాలుగు భాషల్లో విడుదలైంది. తమిళ వెర్షన్ సైతం తక్కువ టైమ్‌లోనే మంచి వ్యూస్ రాబట్టి 5వ ప్లేస్‌లో ఉండటం విశేషం. అంటే ఒకే సినిమాకు చెందిన రెండు వెర్షన్లు (తెలుగు, తమిళం) టాప్ 5లో నిలవడం అనేది అరుదుగా జరిగే విషయం. ఈ మూవీలో నాగార్జున భార్యగా బాలీవుడ్ తార దియా మీర్జా, నాగ్ కొలీగ్‌గా సయామీ ఖేర్ నటించారు.
![]() |
![]() |