![]() |
![]() |

'ఇస్మార్ట్ శంకర్'లో తన నటనతో, నర్తనంతో కుర్రకారుని ఫిదా చేసేసింది నభా నటేశ్. ఆ తరువాత 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్' వంటి సినిమాలతో పలకరించినా ఆ స్థాయి విజయమైతే దక్కలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యూత్ స్టార్ నితిన్ కి జోడీగా 'మాస్ట్రో'లో నటిస్తోంది. జూన్ 11న ఈ సినిమా జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ 'ఇస్మార్ట్' పోరికి ఓ క్రేజీ ప్రాజెక్టులో సెకండ్ లీడ్‌గా నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేసన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. వారిలో ఒకరిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఎంపికైందని టాక్. కాగా, మరో హీరోయిన్‌గా నభా నటేశ్ సెలెక్ట్ అయిందని వినికిడి. అదే గనుక నిజమైతే.. తనకిది బంపర్ ఆఫరే. త్వరలోనే 'ఎన్టీఆర్ 30'లో నభా నటేశ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ తో మిస్ నటేశ్ స్టార్ హీరోయిన్స్ లీగ్‌లో చేరుతుందేమో చూడాలి.

![]() |
![]() |