![]() |
![]() |
.jpg)
కోలీవుడ్ స్టార్ కార్తి టైటిల్ రోల్ లో నటించిన తమిళ చిత్రం `సుల్తాన్`. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాతోనే కోలీవుడ్ లో తొలి అడుగు వేసింది. భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 2న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే, ఎటొచ్చి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తొలి వారాంతంలో వసూళ్ళ పరంగా ఫర్లేదనిపించిన `సుల్తాన్`.. ఆ తరువాత జోరు చూపించలేకపోయాడు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఒకే రోజున రెండు వేర్వేరు ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ కానుందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. `సుల్తాన్` తమిళ వెర్షన్ మే 2న `డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో స్ట్రీమ్ కానుండగా.. అదే రోజున తెలుగు వెర్షన్ `ఆహా`లో స్ట్రీమ్ కానుందని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గతంలో కార్తి నటించిన `ఖైదీ` కూడా రెండు వేర్వేరు ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ వెర్షన్ ని స్ట్రీమ్ చేస్తే.. ఆహా వారి ఓటీటీలో తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అయింది.
మరి.. థియేటర్స్ లో రాణించలేకపోయిన `సుల్తాన్`.. ఓటీటీలో వీక్షకాదరణ పొందుతాడేమో చూడాలి.
![]() |
![]() |