![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ` చేస్తున్నారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారాయన. అందులో ఒకటి.. అఘోరా వేషం కావడం విశేషం. ఇప్పటికే టైటిల్ రోర్ లో అఘోరా గెటప్ తో కనిపించి ఫ్యాన్స్ ని ఫిదా చేసేశారు బాలయ్య. కాగా, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న `అఖండ` థియేటర్స్ లో సందడి చేయనుంది.
`అఖండ` తరువాత `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేనితో బాలయ్య తదుపరి చిత్రం తెరకెక్కనుంది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశముంది. ఈ లోగా మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడితో ఈ చిత్రం ఉంటుందని టాక్. ఇటీవల బాలకృష్ణను సంప్రదించి స్క్రిప్ట్ వినిపించారట అనిల్. కథ నచ్చడంతో బాలయ్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2022 ఆరంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని బజ్.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనిల్ కరోనా పాజిటివ్ కారణంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక మే నుంచి `ఎఫ్ 3` తాలూకు మైసూర్ షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ఆగస్టు 27న రిలీజ్ కానుంది.
![]() |
![]() |