![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ `ఏజెంట్` అవతారమెత్తనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో కనిపించేందుకు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు అఖిల్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన షూటింగ్ ని మే 2 నుండి గోవాలో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
`ఏజెంట్`లో అఖిల్ కి జోడీగా నూతన కథానాయిక సాక్షి వైద్య సందడి చేయనుంది. ఓ కీలక పాత్రలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. యువ సంగీత సంచలనం తమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించనున్నారు.
కాగా, అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` జూన్ 19న థియేటర్స్ లో సందడి చేయనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాని `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందించాడు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చాడు.
![]() |
![]() |