![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు `నీకోసం` (ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో ఒకే ఒక పాటకి డీఎస్పీ బాణీ కట్టారు), `ఖడ్గం`, `వెంకీ`, `భద్ర`, `సారొచ్చారు` చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. బాక్సాఫీస్ పరంగా చూస్తే.. ఒక్క `సారొచ్చారు` తప్ప మిగిలినవన్నీ మెప్పించాయి.
కట్ చేస్తే.. దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత రవితేజ, డీఎస్పీ కాంబోలో మరో సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. `ఖిలాడి`. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా, `ఉప్పెన`తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసిన దేవిశ్రీ ప్రసాద్ `ఖిలాడి`కి ఎంతో శ్రద్ధ పెట్టి మరీ బాణీలు అందిస్తున్నారని టాక్. అలాగే నేపథ్య సంగీతం కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. మరి.. రవితేజ `ఖడ్గం`, `వెంకీ`, `భద్ర`కి డీఎస్పీ ఫ్యాక్టర్ వర్కవుట్ అయినట్టే.. `ఖిలాడి`కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
వేసవి కానుకగా మే 28న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |