![]() |
![]() |

దర్శకుడిగా సురేందర్ రెడ్డిది పదహారేళ్ళ ప్రయాణం. ఈ ప్రస్థానంలో `అతనొక్కడే`, `కిక్`, `రేసు గుర్రం`, `ధ్రువ`, `సైరా.. నరసింహారెడ్డి` వంటి విజయాలు చూశాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు పొందాడు. అయితే, ఒక సినిమా తరువాతే మరో సినిమా అన్నట్లుగానే ముందుకు సాగాడు తప్ప.. ఎప్పుడూ రెండేసి చిత్రాలను ఒకే సమయంలో టేకప్ చేసిన సందర్భం లేదు. అలాంటిది.. ఇప్పుడు సూరి చేతిలోకి మూడు ప్రాజెక్ట్స్ చేరాయని టాక్.
అక్కినేని బుల్లోడు అఖిల్ తో సురేందర్ చేయబోతున్న మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతేకాదు.. యూత్ స్టార్ నితిన్ తోనూ సూరి ఓ ఫ్లిక్ చేయబోతున్నాడట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని బజ్. నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్, `క్రాక్` నిర్మాత `ఠాగూర్` మధు ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మిస్తారని వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
మొత్తమ్మీద.. తక్కువ గ్యాప్ లోనే ముచ్చటగా మూడు సినిమాలతో సురేందర్ రెడ్డి సందడి చేసే అవకాశముందన్నమాట.
![]() |
![]() |