![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. మూడేళ్ళ తరువాత పవన్ నటించిన సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పాటలు, ప్రచార చిత్రాలు కూడా విశేషాదరణ పొందడంతో.. పవన్ ని వెండితెరపై ఎప్పుడెప్పుడా చూస్తామన్న ఆత్రుత అభిమానుల్లో మరింత పెరిగింది. మరో తొమ్మిది రోజుల్లో (ఏప్రిల్ 9) `వకీల్ సాబ్`.. థియేటర్లలోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్`లోని పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అతనికి జోడీగా శ్రుతి హాసన్ కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే.. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఓ `సర్ ప్రైజ్ గెస్ట్` రోల్ ఉందట. అయితే, అది ఎవరో మాత్రం యూనిట్ రివీల్ చేయడం లేదు. దీంతో.. ఆ `అతిథి` ఎవరై ఉంటారన్న విషయంపై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ కి సన్నిహితమైన వ్యక్తే ఆ పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం.
కాగా, `వకీల్ సాబ్`ని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా.. అంజలి, నివేదా థామస్, అనన్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ కోర్ట్ డ్రామా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా తెరకెక్కింది.
![]() |
![]() |