![]() |
![]() |

`ఇస్మార్ట్ శంకర్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన ఎనర్జిక్ స్టార్ రామ్.. ఆపై `రెడ్`తో మరోసారి అభిమానులను మురిపించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ లో రామ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు.. ఈ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడని తెలిసింది. త్వరలోనే రామ్ పాత్రకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. ఫస్ట్ టైమ్ అవుట్ అండ్ అవుట్ కాప్ స్టోరీలో నటిస్తున్న రామ్ కి ఈ చిత్రం ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి. అలాగే.. `ఇస్మార్ట్ శంకర్`, `రెడ్` తరువాత హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
![]() |
![]() |