![]() |
![]() |

తెలుగు ప్రేక్షకుల్ని తొలి సినిమాతోటే 'ఫిదా' చేసిన సాయిపల్లవి, తన ప్రతి క్యారెక్టర్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'లవ్ స్టోరి' ఏప్రిల్ 16న విడుదలవుతోంది. ఇందులో తొలిసారి ఆమె నాగచైతన్యకు జోడీగా నటించింది.
ఇక నాని సరసన రెండోసారి ఆమె నటిస్తోన్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' బాక్సాఫీస్ దగ్గర హిట్టయింది. ఒక ఇంటర్వ్యూలో నాని గురించి మాట్లాడుతూ, "నాని చాలా డెడికేటెడ్. యాక్టర్ కావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అతను, ఇప్పటికీ చాలా వినమ్రంగా కనిపిస్తుంటాడు. సెట్స్‌పై ఎవరేం చేస్తున్నారో అతనికి తెలుసు. అందుకే కమర్షియల్ సినిమా చేస్తున్నా కూడా అక్కడి వాతావరణాన్ని సాధ్యమైనంత వాస్తవికంగా ఉండేలా చూస్తుంటాడు. ప్రతిదీ సాధ్యమైనంత నాచురల్‌గా ఉండేలా ట్రై చేస్తుంటాడు." అని చెప్పింది.
కెమెరా ముందు ఏమీ చేయకుండా ఊరికే నిల్చొని ఉండటం తనకు నచ్చదని సాయిపల్లవి అంటోంది. "హీరో ఫైట్ చేస్తున్నప్పుడు కూడా, నిల్చొని ఉండటం నాకు నచ్చదు. ఎందుకంటే ఆ టైమ్‌లో మన మనిషిని కాపాడుకోవాలని విలన్‌ను తోసెయ్యాలని చూస్తాం కదా! అందువల్ల కెమెరా ముందు ఏమీ చేయకుండా అలా నిలబడటం నాకెప్పుడూ అసౌకర్యంగానే అనిపిస్తుంది. 'ఎంసీఏ' సినిమాలో నేను కొన్ని సీన్లలో అసౌకర్యంగా ఫీలైతే, 'నువ్వేం ఫీలవుతున్నావో నాకు తెలుసు. ప్లీజ్, బ్యాడ్‌గా ఫీలవకు. జస్ట్ ఇదొక ఫేజ్' అని చెప్పాడు. అది చెప్పాల్సిన అవసరం అతనికి లేదు, ఎందుకంటే ఆ సినిమా చేయమని అతనేమీ నన్ను ఒప్పించలేదు." అని చెప్పుకొచ్చింది.
![]() |
![]() |