![]() |
![]() |

"ఆర్ యు ఎ వర్జిన్?" అని కోర్టు బోనులో నిల్చొని వున్న యువకుడ్ని అడిగాడు వకీల్ సాబ్. షాకైపోయి, "అబ్జెక్షన్ యువరానర్" అంటూ అడ్డుకోబోయాడు ప్రాసిక్యూటర్ నందాజీ. "మీరైతే అమ్మాయిల్ని అడగొచ్చు. మేమైతే అబ్బాయిల్ని అడక్కూడదా? ఏం న్యాయం నందాజీ ఇది? కూర్చోండి. కూర్చోండి చాలు." అని గద్దించాడు వకీల్ సాబ్. చేసేదేం లేక కూర్చొన్నాడు నందాజీ.
ఈ ఇంట్రెస్టింగ్ సీన్ 'వకీల్ సాబ్' సినిమాలోనిది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తోన్న 'వకీల్ సాబ్' ట్రైలర్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ ట్రైలర్‌ను సినిమా టీమ్ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 9 సెకన్ల ఈ ట్రైలర్ రిలీజైన కొద్ది క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ను పవన్ ఫ్యాన్స్ విరివిగా షేర్ చేస్తూ వైరల్ చేసేశారు.
ఈ ట్రైలర్‌లో లాస్ట్ సీన్‌లో వకీల్ సాబ్‌గా పవన్ కల్యాణ్ చేసిన వాదనకు నందాజీ క్యారెక్టర్ పోషించిన ప్రకాశ్‌రాజ్ మారు మాట్లాడకుండా కూర్చోవడం ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. అంతకు ముందు అదే కోర్టు బోనులో వేముల పల్లవి పాత్రధారి నివేదా థామస్‌ను నందాజీ "ఆర్ యు ఎ వర్జిన్?" అని ప్రశ్నించడం ట్రైలర్ బిగినింగ్‌లో మనం చూస్తాం. దానికి రిటార్ట్‌గా నందాజీ మేల్ క్లయింట్‌ను అదే క్వశ్చన్ వేసి, ఖంగు తినిపించాడు వకీల్ సాబ్.
ఈ ట్రైలర్ ద్వారా సినిమా స్టోరీ ఏమిటనేది కొంత రివీల్ అయింది. ఇదేమీ ఒరిజినల్ స్టోరీ కాదనీ, హిందీ హిట్ ఫిల్మ్ 'పింక్'కు 'వకీల్ సాబ్' రీమేక్ అనీ మనకు తెలుసు. ఈ సినిమా కథ ఫ్రెండ్స్ అయిన ముగ్గురమ్మాయిల చుట్టూ నడుస్తుంది. ఆ ముగ్గురమ్మాయిలు సరదాగా కొంతమంది మేల్ ఫ్రెండ్స్‌తో ఒక రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ వారు లైంగిక వేధింపులకు గురవుతారు. తమను తాము రక్షించుకొనే క్రమంలో ఆ మగవాళ్లను గాయపరుస్తారు.
ఈ కేసు కోర్టుకు వస్తుంది. ముగ్గురమ్మాయిలూ నిందితులవుతారు. చాలా కాలంగా కోర్టు ముఖం చూడని వకీల్ సాబ్‌ను ఆశ్రయిస్తారు ఆ అమ్మాయిలు. "స్టేట్ వర్సెస్ వేముల పల్లవి" కేసుగా హియరింగ్‌కు వస్తుంది ఆ కేసు. ఆ ముగ్గురమ్మాయిలకు లాయర్‌గా మాత్రమే కాకుండా గార్డియన్‌గా కూడా వకీల్ సాబ్ మారతాడని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.
ఇంతదాకా మనం చూసిన పవన్ కల్యాణ్ వేరు, 'వకీల్ సాబ్'లో మనం చూడబోతున్న పవన్ కల్యాణ్ వేరని ఈ ట్రైలర్‌తో ఈజీగా అర్థమైపోతోంది. కోర్టులో "ప్రకాశ్ రాజ్ వర్సెస్ పవన్ కల్యాణ్" అనే రీతిలో సాగే సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. తన వాదనలో భాగంగా పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ గ్యారంటీ!
ట్రైలర్‌లో తొలిసారి పవర్‌స్టార్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇప్పటికే ఆ సీన్ ఫస్ట్ లుక్‌గా వచ్చి అలరించింది. ఒక మినీ ట్రక్కులో తన ఇంటి సామాను వేసుకొని వెళ్తున్న పవన్ కల్యాణ్, ఆ ట్రక్కు పైన కూర్చొని ఓ పుస్తకం చదువుతూ కనిపించే సీన్ అది. లాయర్ లుక్‌లో పవర్‌స్టార్ బాగా ఆకట్టుకున్నారు. కోర్టులో వాదించేటప్పుడు కూడా ఆయన స్టైల్‌ను మిస్సవలేదు.
తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వకీల్ సాబ్‌కు కీలకం కానున్నదని ట్రైలర్‌తో అర్థమైపోతోంది. సందేహం లేదు.. తమన్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. ముగ్గురమ్మాయిల్లో నివేదా థామస్ నటన ఈ సినిమాకు ఇంకో ఎస్సెట్ అవుతుందనేది ఖాయం. అయితే వకీల్ సాబ్ భార్యగా నటించిన శ్రుతి హాసన్‌కు ట్రైలర్‌లో చోటు దక్కలేదు.
ఏదేమైనా.. 'వకీల్ సాబ్' మేనియా మొదలైపోయింది. ట్రైలర్ రిలీజైన 7 నిమిషాల్లోనే లక్ష లైక్స్ రావడం, 20 నిమిషాల్లోనే 2 లక్షల లైక్స్ రావడం ఇందుకు నిదర్శనం. అత్యంత తక్కువ సమయంలో 2 లక్షల లైక్స్ సాధించిన తెలుగు మూవీ ట్రైలర్‌గా ఇది రికార్డ్ సృష్టించింది. ఇదివరకు 'సాహో' మూవీ ట్రైలర్ 2 లక్షల లైక్స్ రావడానికి 86 నిమిషాల టైమ్ తీసుకుంది. 'వకీల్ సాబ్' తర్వాత దానిదే సెకండ్ ప్లేస్. ఇది చాలదూ.. 'వకీల్ సాబ్' దూకుడు ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి!
శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న వస్తోంది. ఇక రికార్డులు బద్దలవడమే మిగిలుంది.
![]() |
![]() |