![]() |
![]() |

`రెమో`, `శక్తి` వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. తమిళనాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. త్వరలో ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నాడని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `వీడొక్కడే`, `రంగం`, `బ్రదర్స్` చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ కాంబినేషన్ లో శివకార్తికేయన్ ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నాడట. అంతేకాదు.. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది. మరి.. ఈ ద్విభాషా చిత్రం శివకార్తికేయన్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` సినిమాల హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో శివకార్తికేయన్ జట్టుకట్టిన కోలీవుడ్ వెంచర్ `డాక్టర్` త్వరలోనే రిలీజ్ కానుంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ కాగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరకర్త.
![]() |
![]() |