![]() |
![]() |
.jpg)
2000 ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ లో ఒకటైన `చిత్రం`కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 21 ఏళ్ళ తరువాత ఆ చిత్ర దర్శకుడు తేజ.. `చిత్రం 1.1` పేరుతో ఈ సీక్వెల్ చేస్తున్నారు. `చిత్రం`కి బాణీలు అందించిన ఆర్.పి. పట్నాయక్ నే ఈ ప్రాజెక్ట్ కి కూడా స్వరకర్త కావడం విశేషం. అంతేకాదు.. దాదాపు 40 మంది కొత్తవాళ్ళని ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు తేజ.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కథానాయకుడిగా యంగ్ టైగర్ యన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఏప్రిల్ 18న జరుగనున్న `చిత్రం 1.1` ప్రారంభోత్సవానికి తారక్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు వినికిడి. త్వరలోనే `చిత్రం 1.1`లో నితిన్ చంద్ర ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
తేజ పరిచయం చేసిన యువ కథానాయకుల్లో ఉదయ్ కిరణ్ (చిత్రం), నితిన్ (జయం) వంటి వారు తొలి ప్రయత్నాల్లోనే విజయాలను అందుకున్న నేపథ్యంలో.. నితిన్ చంద్ర కూడా అదే బాట పడతాడేమో చూడాలి మరి.
![]() |
![]() |