![]() |
![]() |

2005లో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు చిత్రం `ఛత్రపతి`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా.. ఇప్పడు బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. అటు బెల్లంకొండకి, ఇటు వినాయక్ కి ఇదే తొలి హిందీ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా బ్రదర్ నాగబాబు ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మాతృకలో ప్రదీప్ రావత్ పోషించిన రాజ్ బిహారి పాత్రలో ఆయన దర్శనమివ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని వినికిడి. త్వరలోనే `ఛత్రపతి` రీమేక్ లో నాగబాబు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనున్న `ఛత్రపతి` హిందీ వెర్షన్.. ఈ ఏడాది చివరలో కానీ వచ్చే సంవత్సరం ఆరంభంలో కానీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |