![]() |
![]() |

లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి, `జాతిరత్నం` నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ క్రేజీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. పాతికేళ్ళ కుర్రాడు, 40 ఏళ్ళ అవివాహిత మధ్య సాగే ప్రణయగాథగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. `రా రా కృష్ణయ్య` ఫేమ్ మహేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి `మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి` అనే టైటిల్ ని ఫిక్స్ చేసిందట యూనిట్. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి పేర్లు కలిసొచ్చేలా ఈ శీర్షికని డిజైన్ చేశారట. త్వరలోనే అనుష్క, నవీన్ కాంబో మూవీ, టైటిల్ పై మరింత క్లారిటీ వస్తుంది.
`నిశ్శబ్దం` తరువాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కాగా.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నవీన్ పోలిశెట్టి నుంచి రానున్న చిత్రమిది. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా, అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |