![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి పనిచేసిన `సింహా`, `లెజెండ్` చిత్రాలు.. తెలుగునాట సంచలనం సృష్టించాయి. అలాంటి ఈ కాంబో.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఓ సినిమా చేస్తోంది. గత రెండు సినిమాల తరహాలోనే ఇది కూడా యాక్షన్ డ్రామానే. అంతేకాదు.. `సింహా`, `లెజెండ్` శైలిలో ఇందులోనూ బాలయ్యది డబుల్ యాక్షన్ నే.
ఇదిలా ఉంటే.. బాలయ్య - బోయపాటి థర్డ్ జాయింట్ వెంచర్ కి సంబంధించిన టైటిల్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కేవలం వర్కింగ్ టైటిల్ (#BB3)తోనే ఇన్నాళ్ళు ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. మహాశివరాత్రికి టైటిల్ ప్రకటిస్తారని కథనాలు వచ్చినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో.. ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 13న టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లు బజ్. మరి.. మంచి ముహూర్తాన్నే ఫిక్స్ చేసుకున్న బాలయ్య - బోయపాటి అండ్ టీమ్.. ఎలాంటి శీర్షికతో పలకరిస్తారో చూడాలి.
కాగా, బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |