![]() |
![]() |

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇది కావాలని చేశారా? లేక కోపంతో కో డైరెక్టర్ మహేష్ చేశారా అన్నది మాత్రం తెలియడం లేదు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు విగ్గులు పెట్టుకుని వెండితెరపై కనిపిస్తారన్నది చాలా మందికి తెలిసిందే.
తెర ముందు ఒకలా తెర వెనుక ఒకలా కనిపించే స్టార్స్ గురించి ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ వార్తలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాలకు సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆయన దగ్గర గత నాలుగేళ్లుగా కో డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న మహేష్ అనే వ్యక్తి తనని అకారణంగా శ్రీనివాస్ అవసరాల దూషించాడని, కారణం కూడా చెప్పకుండా తనని ఆఫీస్ నుంచి బయటికి పంపించాడని ఆరోపీస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే తన ఆఫీస్‌లో క్యాప్ పెట్టుకుని శ్రీనివాస్ అవసరాల ఫొటో షూట్ లో పాల్గొంటున్నాడు. మధ్యలో కో డైరెక్టర్ మహేష్ అనే వ్యక్తి వెళ్లి తనని అకారణంగా ఎందుకు దూషించావని, ఎందుకు వెళ్లి పొమ్మన్నావని ప్రశ్నించడం..దానికి అవసరాలు ఏదో అనడం.. ఆ తరువాత అవసరాల బండారం చూడండి అంటూ అతని క్యాప్ తొలిగిస్తే అవసరాల బట్టతల కనిపించడం వైరల్‌గా మారింది. ఇది నిజమా? లేక కావాలనే ఇలా చేశారా? అన్నది తెలియాల్సి వుంది.
![]() |
![]() |