![]() |
![]() |

అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం `కప్పేళ`. మహ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్.. గత ఏడాది అటు థియేటర్స్ లోనూ, ఇటు నెట్ ఫ్లిక్స్ లోనూ ఆదరణకు నోచుకుంది.
కాగా, ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో `విశ్వాసమ్` ఫేమ్ అనిఖ సురేంద్రన్, నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ చిత్రానికి `బుట్టబొమ్మ` అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వినికిడి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ అనుబంధ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. భాగస్వామ్యంలో నిర్మించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని `బుట్టబొమ్మ` పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడా పాటలోని పల్లవి తాలూకు తొలి పదాన్నే `కప్పేళ` రీమేక్ కి టైటిల్ గా ఫిక్స్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. మలయాళంలో ఆదరణ పొందిన `కప్పేళ`.. తెలుగువారి ఆమోదముద్రను కూడా పొందుతుందేమో చూడాలి.
![]() |
![]() |