![]() |
![]() |

కింగ్ నాగార్జున, ఆయన చిన్న కొడుకు అఖిల్.. మల్టిస్టారర్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `లూసీఫర్` రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్న కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా.. తాజాగా నాగ్, అఖిల్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారట. అది నచ్చడంతో సినిమా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నాగ్ అండ్ అఖిల్. అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నారని టాక్. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వినికిడి. త్వరలోనే నాగ్, అఖిల్ మల్టిస్టారర్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, అఖిల్ బుడిబుడి అడుగుల ప్రాయంలో నటించిన `సిసింద్రీ` (1995)లోనూ, అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రం `అఖిల్` (2015)లోనూ నాగ్ సందడి చేశారు. అలాగే అక్కినేని మల్టిస్టారర్ `మనం` (2014)లో అఖిల్ తళుక్కున మెరిశారు. మొత్తానికి.. మోహన్ రాజా దర్శకత్వంలో రానున్న చిత్రం నాగ్, అఖిల్ కాంబోకి నాలుగో చిత్రం కానుందన్నమాట.
![]() |
![]() |