![]() |
![]() |

`ఓ పనైపోతుంది బాబూ`, `విక్రమార్కుడు`, `దరువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి అలరించారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఖిలాడి`లోనూ రవితేజ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు. కట్ చేస్తే.. `ఖిలాడి` తరువాత రాబోతున్న #RT68లో కూడా రవితేజ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్. కాగా, ఈ చిత్రంలోనే మాస్ మహారాజా డ్యూయెల్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారని వినికిడి. త్వరలోనే రవితేజ ద్విపాత్రాభినయంపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రవితేజకి జోడీగా శ్రీలీల, లవ్లీ సింగ్ నాయికలుగా నటించనుండగా.. `జాతిరత్నాలు` ఫేమ్ ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రలో కనిపించనుందని బజ్.
![]() |
![]() |