![]() |
![]() |

రాజీవ్ కనకాల, సుమ కనకాల ప్రేమ పెళ్లి అన్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన సుమని 1999లో రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1994లో ఓ స్టూడియోలో సుమని చూసిన రాజీవ్ కనకాల తొలి చూపులోనే ఆమె అంటే ఇష్టం పెంచుకున్నారట. అలా వీరి ప్రేమాయణం మొదలైంది. అప్పుడు సుమ హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తోంది. రాజీవ్ మాత్రం బుల్లితెరపై రాణించాలని ప్రయత్నాల్లో వున్నారు.
అయితే వీరి ప్రేమ ఆ తరువాత పెళ్లికి దారి తీయడంతో సుమకు రాజీవ్ ఓ కండీషన్ పెట్టారట. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదన్నది రాజీవ్ కండీషన్. అవి విని సుమ రాజీవ్‌ని తిట్టేసిందట. అలా కుదరదని, తాను నటిస్తానని ఖరాకండీగా చెప్పేసి రాజీవ్‌కి బ్రేకప్ చెప్పిందట. అలా దాదాపు ఏడాదిన్నర పాటు రాజీవ్‌కు సుమ దూరంగా వుందట.
రాజీవ్ కనకాల తన తప్పు తెలుసుకుని ఎన్ని సార్లు సుమతో మాట్లాడాలని ప్రయత్నించినా తను మాట్లాడలేదట. అయితే ఆ తరువాత కాల క్రమేనా సినిమా అవకాశాలపై సుమకు ఆసక్తి తగ్గడం, యాంకరింగ్‌పై ఆసక్తి పెరగడంతో తిరిగి రాజీవ్‌కి సుమ దగ్గరైందని, ఆ తరువాతే తమ ప్రేమ విషయాన్ని రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలకి వివరించి పెళ్లికి ఒప్పించామని సుమ ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. రాజీవ్‌తో పెళ్లి, మధ్యలో గిల్లి కజ్జాలు వంటి విషయాల్ని ఈ సందర్భంగా వెల్లడించింది సుమ.
![]() |
![]() |