![]() |
![]() |

తెలుగునాట స్టార్ డైరెక్టర్ గా రాణించారు పూరీ జగన్నాథ్. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా.. శివరాజకుమార్ హీరోగా `యువరాజా` (2001) (`తమ్ముడు` రీమేక్) - పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా `అప్పు` (2002) (`ఇడియట్`కి మాతృక) రూపొందించి శాండల్ వుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పూరి.
నాలుగేళ్ళ క్రితం ఇషాన్ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో `రోగ్` (2017) చిత్రాన్ని తెరకెక్కించిన పూరి.. త్వరలో మరో బైలింగ్వల్ (కన్నడ- తెలుగు) మూవీ ప్లాన్ చేస్తున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. `పొగరు` ఫేమ్ ధ్రువ సర్జా ఇందులో కథానాయకుడిగా నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చని వినికిడి.
కాగా, పూరీ జగన్నాథ్ ప్రస్తుతం `లైగర్` మూవీ చేస్తున్నారు. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.
![]() |
![]() |