![]() |
![]() |

`ఆర్ ఎక్స్ 100`తో సెన్సేషన్ హిట్ సొంతం చేసుకున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఆ సినిమాకి ముందు చేసిన `ప్రేమతో మీ కార్తిక్`, తరువాత వచ్చిన `హిప్పీ`, `గుణ 369`, `90ఎం.ఎల్` తనని తీవ్ర నిరాశపరిచాయి. ఇక రీసెంట్ గా రిలీజైన `చావు కబురు చల్లగా` మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని తొలి రోజు ఫర్లేదనిపించి క్రమంగా చల్లబడింది. దీంతో.. వన్ మూవీ వండర్ అయిపోయాడు కార్తికేయ. ఇక ప్రతినాయకుడిగా నటించిన `గ్యాంగ్ లీడర్` కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్ కి.. సక్సెస్ ని అందించలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే.. తన ఆశలన్నీ కోలీవుడ్ స్టార్ అజిత్ పైనే పెట్టుకున్నాడు కార్తికేయ. ఎందుకంటే.. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న `వలిమై`లో కార్తికేయ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ భారీ బడ్జెట్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. అజిత్ సినిమాతోనైనా ఈ `ఆర్ ఎక్స్ 100` సెన్సేషన్.. సక్సెస్ ని అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |