![]() |
![]() |

నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే`. `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సమ్మర్ స్పెషల్ గా మార్చి 26న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. సెన్సార్ నుంచి `యు/ఎ` సర్టిఫికేట్ పొందిన `రంగ్ దే` చిత్రానికి సంబంధించి రన్ టైమ్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ డ్యూరేషన్ కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమేనట. ఒకరకంగా.. చిత్రనిడివి `రంగ్ దే`కి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అంతేకాదు.. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఫస్టాఫ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తోనూ.. సెకండాఫ్ ఎమోషనల్ టచ్ తో మిక్స్ అయి వినోదాత్మకంగానూ ఉంటుందని తెలిసింది.
మరి.. నితిన్, కీర్తి సురేశ్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న `రంగ్ దే`.. వారి జోడీకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
కాగా, `రంగ్ దే`లో నరేశ్, కౌసల్య, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |