![]() |
![]() |
.jpg)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `రన్`, `పందెం కోడి`, `ఆవారా` సినిమాల దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానుసారం మరో నాయిక పాత్రకి కూడా స్థానముందట. ఆ పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ని ఎంపిక చేశారని టాక్. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `గ్యాంగ్ లీడర్`తో ప్రియాంక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజైన శర్వానంద్ `శ్రీకారం`లోనూ తనే నాయిక. మరోవైపు.. తమిళంలోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచితమైన తనని సెకండ్ లీడ్ గా ఎంచుకున్నారని వినికిడి. త్వరలోనే రామ్ - లింగుస్వామి కాంబినేషన్ మూవీలో ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఈ ఏడాది చివరలో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |