![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం `పుష్ప`. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నట్లు ఆదివారం చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దాదాపు 20 ఏళ్ళుగా మలయాళంలో నటుడిగా రాణిస్తున్న ఫాహద్.. ఇప్పటివరకు కేవలం రెండు మలయాళేతర చిత్రాల్లోనే నటించాడు. అవి కూడా తమిళ సినిమాలే కావడం విశేషం. ఆ చిత్రాలే.. `వేలైక్కారన్`(2017), `సూపర్ డీలక్స్`(2019). ఫాహద్ కీలక పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించాయి. ఈ నేపథ్యంలో.. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తెలుగు చిత్రం `పుష్ప`తోనూ ఫాహద్ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ `ఇరుళ్` ఏప్రిల్ 2న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుండగా.. పొలిటికల్ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ `మాలిక్` మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |