![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `BB3` (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్నారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇందులో బాలకృష్ణకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `BB3` తరువాత `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారు నటసింహ. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. మే నెల నుంచి ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా, ఈ చిత్రంలో బాలయ్యకి జంటగా ఓ బాలీవుడ్ బ్యూటీ నటించబోతోందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. `దబాంగ్` భామ సోనాక్షి సిన్హాని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీలో సోనాక్షి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ రూపొందించనున్న సినిమాలోనూ సోనాక్షి నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నే నిర్మిస్తుండడం విశేషం. ఏదేమైనా.. మరికొద్ది రోజుల్లో సోనాక్షి టాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత వస్తుంది.
![]() |
![]() |