![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ రేసీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు.. ఇందులో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. 'అఖిల్ 5'కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో 'స్పై' (గూఢచారి) పాత్రలో మోహన్ లాల్ దర్శనమివ్వనుండగా.. 'సీక్రెట్ కాప్'గా అఖిల్ కనిపించనున్నాడట. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వినికిడి. త్వరలోనే 'అఖిల్ 5'కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' జూన్ 19న థియేటర్స్ లోకి రానుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించారు.
![]() |
![]() |