![]() |
![]() |

క్రిస్ ఇవాన్స్ అంటే తెలియని యూత్ ఉండరు. 'కెప్టెన్ అమెరికా' అంటే యూత్‌తో పాటు ఏమాత్రం హాలీవుడ్ సినిమాల గురించి తెలిసినవాళ్లయినా గుర్తు పట్టేస్తారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన 'అవెంజర్స్' సిరీస్ సహా పలు సినిమాల్లో కెప్టెన్ అమెరికా పాత్ర చేసి, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌నూ, అశేష అభిమానుల్నీ సంపాదించుకున్న క్రిస్ ఇవాన్స్.. హాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడు. కొంతమందైతే.. "అతను కెప్టెన్ అమెరికా కాదయ్యా.. కాసనోవా" అని సరదాగా అంటుంటారు. అవును మరి.. మనవాడి డేటింగ్ హిస్టరీ చిన్నదేమీ కాదు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పలువురితో అను ప్రేమాయణం నడిపినట్లు హాలీవుడ్ టాబ్లాయిడ్స్ కోడై కూస్తుంటాయి. ఒక్కసారి ఆ లిస్ట్ వంక లుక్కేద్దామా...
కేట్ బోస్‌వర్త్

2000 సంవత్సరంలో వచ్చిన 'న్యూకమర్స్' మూవీలో క్రిస్, కేట్ లవర్స్‌గా నటించారు. ఆ సినిమా చేసేటప్పుడే ఇద్దరి మధ్యా ప్రేమపుట్టి, కొంత కాలం కలిసి తిరిగారు. ఆ తర్వాత కాలంలో డైరెక్టర్ మైఖేల్ పాలిష్‌ను పెళ్లి చేసుకుంది కేట్.
జెస్సికా బీల్

'సెల్యులార్' (2004), 'లండన్' (2005) సినిమాల్లో కలిసి నటించారు క్రిస్, జెస్సికా. అయితే వాటిలో నటించడానికంటే ముందే, 2001లోనే ఆ ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. 'నాట్ ఎనదర్ టీన్' మూవీతో అప్పుడే యూత్ హార్ట్ త్రోబ్‌గా పేరు తెచ్చుకున్నాడు క్రిస్. అనేక రెడ్ కార్పెట్ ఈవెంట్స్‌తో ఆ ఇద్దరూ జంటగా పాల్గొన్నారు. "మేం పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలనుకుంటున్నాం." అని 2005లో జెస్సికా చెప్పింది. కానీ 2006లో వారు విడిపోయారు. ఫేమస్ సింగర్ జస్టిన్ టింబర్‌లేక్‌ను పెళ్లాడి, లైఫ్‌లో స్థిరపడింది జెస్సికా.
క్రిస్టియన్ రిక్సీ

2007లో ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో కలిసి పాల్గొని, చేతిలో చేయి వేసుకొని తిరిగారు కేట్, రిక్సీ. వారి బంధం చాలా స్వల్ప కాలమే సాగింది. తర్వాత రిక్సీ కెమెరామన్ జేమ్స్ హీర్‌డెజెన్‌ను వివాహం చేసుకుంది.
మింకా కెల్లీ

రిక్సీ తర్వాత 2007లోనే 'ఫ్రైడే నైట్ లైట్స్' నటి మింకా కెల్లీతో చెట్టాపట్టాలేసుకు తిరిగాడు క్రిస్. చాలా త్వరగానే ఆ ఇద్దరూ విడిపోయారు. కానీ తిరిగి 2012-13 మధ్య మరోసారి ఇద్దరూ కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ రీయూనియన్ కూడా ఏడాది కంటే ఎక్కువ కాలం నడవలేదు. మింకా ఇప్పుడు టెలివిజన్ హోస్ట్ ట్రెవర్ నోవాతో డేటింగ్‌లో ఉంది.
డయానా అగ్రోన్

2011లో ప్రి ఆస్కార్ పార్టీలో కలుసుకున్న క్రిస్, డయానా చూపులు కలిశాయి. అప్పుడు 'గ్లీ' అనే టీవీ షోకు డయానా హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నాళ్లు కలిసి తిరిగాక గుడ్‌బై చెప్పేసుకున్నారు. ఇప్పుడు డయానా బ్రిటిష్ సంగీతకారుడు విన్‌స్టన్ మార్షల్ భార్య.
లిలీ కాలిన్స్
.jpg)
డయానా అగ్రోన్ తరహాలోనే 2015 ఆస్కార్ పార్టీలో 'ఎమిలీ ఇన్ పారిస్' స్టార్ లిలీ కాలిన్స్‌ను కలిశాడు క్రిస్. ఆ ఏడాది మార్చిలో ఆ కొత్త ప్రేమికులు చాలా సమయాన్ని కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు. లాస్ ఏంజెల్స్‌లో డిన్నర్‌కు కలిసి వెళ్లి కెమెరా కళ్లకు చిక్కారు. కానీ తన సహనటుడు జేమీ క్యాంప్‌బెల్ తనను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను ఆమె షేర్ చేయడంతో.. క్రిస్ ఆమెతో బంధాన్ని తెంచేసుకున్నాడు.
జెన్నీ స్లేట్

జెస్సికా తర్వాత పబ్లిక్‌లో క్రిస్ ఎక్కువగా కనిపించింది లేడీ కమెడియన్ జెన్నీ స్లేట్‌తోటే. 2015లో 'ద గిఫ్టెడ్' మూవీలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. అప్పటికే ఆమె డీన్ ఫ్లీషర్-క్యాంప్ భార్య. 2016 మేలో అతనితో విడిపోయానని జెన్నీ ఎనౌన్స్ చేశాకే, క్రిస్-జెన్నీ జంటగా పబ్లిక్‌లోకి వచ్చారు. 2017 ఫిబ్రవరిలో ఆ ఇద్దరూ బ్రేకప్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఏడాది క్రిస్మస్‌ను క్రిస్ ఫ్యామిలీతోటే గడిపింది జెన్నీ. అయితే 2018 మార్చిలో తాము విడిపోయామని క్రిస్ వెల్లడించాడు.
లిలీ జేమ్స్

ఇటీవలి కాలంలో క్రిస్‌తో కలిసి వినిపించిన పేరు 'సిండ్రెల్లా' స్టార్ లిలీ జేమ్స్. లండన్‌లో 2020 జూలైలో ఓ క్లబ్‌లో కలిసి కనిపించిన ఆ ఇద్దరూ, ఆ తర్వాత క్రిస్ బసచేసిన హోటల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందా, లేదా అనేది మిస్టరీ.
![]() |
![]() |