![]() |
![]() |

గోపీచంద్, తమన్నా జంటగా రూపొందుతోన్న చిత్రం 'సీటీమార్'. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అప్సరా రాణి ఓ ఐటమ్ సాంగ్ చేసింది. "నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ.. నీ ఊరేదైతే ఏంటీ.. నా ఒళ్లేరా నీకు ఊటీ.." అంటూ సాగే ఈ పాటలో అప్సర హాట్ స్టెప్పులు, ఆమె వొంపుసొంపులు మాస్ ఆడియెన్స్‌ను కిర్రెక్కిస్తున్నాయి.
ఇంతకు ముందు రవితేజ-గోపీచంద్ మలినేని హిట్ ఫిల్మ్ 'క్రాక్'లో "భూమ్ బద్దల్' సాంగ్‌తో అలరించిన ఆమె, ఇప్పుడు "నా పేరే పెప్సీ ఆంటీ" సాంగ్‌తో మరింతగా రసికుల హృదయాల్ని కొల్లగొడుతోంది. ఆదివారం ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఆడియన్స్ ను అలరించేలా మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారనిపిస్తోంది. విపంచి రాసిన ఈ పాటను సింగర్ కీర్తన శర్మ అంతే హుషారుగా ఆలపించారు. ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.
దిగంగనా సూర్యవంశీ మరో నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా, రావు రమేశ్, రెహమాన్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, రీసెంట్‌గా విడుదలైన "జ్వాలా రెడ్డి" సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయనున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. సౌందరరాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, తమ్మిరాజు ఎడిటింగ్, సత్యనారాయణ డి.వై. ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించారు.

![]() |
![]() |