![]() |
![]() |

కోలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరైన అజిత్ చెన్నైలో ఆటోలో ప్రయాణించి, తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్‌ను ఇష్టపడే ఆయన ఎలాంటి హంగామా లేకుండా చెన్నై సిటీని ఆటోలో చుట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఒక్కో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాడనే పేరున్నప్పటికీ తమిళనాట అజిత్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఒక సినిమా చేయడానికి యావరేజ్‌న ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం ఆయన తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'వాలిమై' మూవీ ఫస్ట్ లుక్‌ను మే 1న విడుదల చేస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.
కోలీవుడ్‌లో 'వాలిమై' మూవీపై భారీ అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరుకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటూ ఫ్యాన్స్‌ను అడిగారంటే ఈ సినిమా ఎలాంటి క్రేజ్‌ను పొందుతోందో ఊహించుకోవచ్చు.
తళ అజిత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ అయిన కణ్ణదాసన్ బాలమురుగన్ మాట్లాడుతూ, "అజిత్ సార్ సింప్లిసిటీ అసాధారణం. ఆయన వీధుల్లో నడుస్తూ తిరుగుతారు, ఆటోలో ప్రయాణిస్తారు. ఇవన్నీ ఆయన మనస్ఫూర్తిగా చేస్తారు. ఆయన సూపర్ స్టార్ అయినా హృదయంలో ఆయన ఒక కామన్ మ్యాన్." అని చెప్పారు.

![]() |
![]() |