![]() |
![]() |

టాలీవుడ్ హిట్ పెయిర్స్ లో జగపతిబాబు, ఆమనికి ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `శుభలగ్నం`, `మావిచిగురు`, `శుభమస్తు` వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి.
కట్ చేస్తే.. ఈ జంట చాన్నళ్ళ తరువాత మరోసారి జట్టుకట్టనుందట. అయితే, ఈ సారి సినిమా కోసం కాదు.. ఓ వెబ్ సిరీస్ లో ఈ ఇద్దరు కలసి నటించబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. తెలుగువారి ఓటీటీ వేదిక `ఆహా` ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. పొలిటికట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సిరీస్ లో జగపతిబాబు, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య సాగే సన్నివేశాలు సిరీస్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. త్వరలోనే ఈ సిరీస్.. ఆహాలో స్ట్రీమ్ కానుంది. మరి.. వెండితెరపై విజయాలు చూసిన ఈ జోడీ.. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ ని కొనసాగిస్తుందేమో చూడాలి.
కాగా, ఆమని తల్లి పాత్రలో నటించిన `చావు కబురు చల్లగా` ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనుండగా.. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన `టక్ జగదీష్` వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అలాగే.. ఇద్దరి చేతిలోనూ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
![]() |
![]() |