![]() |
![]() |

తెలుగునాట పోలీస్ పాత్రలకు చిరునామాగా నిలిచే నటుల్లో సంపత్ రాజ్ ఒకరు. `రన్ రాజా రన్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `రాజా ది గ్రేట్`, `నేల టిక్కెట్టు`, `భీష్మ`, `చెక్`.. ఇలా పలు చిత్రాల్లో ఖాకీ దుస్తుల్లో కనిపించారు సంపత్. ఇవన్నీ కూడా స్ట్రయిట్ పిక్చర్స్ నే కావడం విశేషం. కట్ చేస్తే.. మరోసారి ఈ టాలెంటెడ్ యాక్టర్ పోలీసాఫీసర్ గా దర్శనమివ్వనున్నారు. అయితే.. ఈ సారి ఓ రీమేక్ మూవీలో ఈ తరహా పాత్రలో కనిపించబోతున్నారు సంపత్.
ఆ వివరాల్లోకి వెళితే.. `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన మలయాళ చిత్రం `దృశ్యం 2` ఆధారంగా.. విక్టరీ వెంకటేశ్ `దృశ్యం 2` చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో ఒరిజినల్ వెర్షన్ లో మురళీ గోపీ పోషించిన పాత్రను ధరిస్తున్నారు సంపత్. పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఈ క్యారెక్టర్ లో సంపత్ మరోసారి పోలీస్ అధికారిగా ఆకట్టుకుంటారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. `దృశ్యం 2`తో సంపత్ కి ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
కాగా, `దృశ్యం 2`లో వెంకీకి జోడీగా మీనా నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో నరేశ్, నదియా, ఎస్తేర్ కనిపించనున్నారు. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్.. జూన్ లేదా జూలైలో థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |