![]() |
![]() |

తెలుగు సహా దక్షిణాది భాషా చిత్రసీమలో గ్లామరస్ హీరోయిన్‌గా అప్పటి ప్రేక్షకుల్ని అలరించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ రాణించిన ప్రముఖ నటి జయచిత్ర కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్‌ను రూ. 26 కోట్ల స్కామ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వరిని ఆకర్షించే ఇరీడియంతో తయారుచేసిన కలశాన్ని ఇస్తామని ప్రామిస్ చేసిన నెడుమారన్ అనే వ్యాపారిని మోసం చేశారనేది అమ్రేష్, అతని ఫ్రెండ్స్‌పై మోపబడిన అభియోగం. 2013లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు తను అమ్రేష్‌కు రూ. 26.2 కోట్ల రూపాయలను ఇచ్చానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నెడుమారన్ తెలిపారు.
2013 నుంచి మూడేళ్ల పాటు అమ్రేష్, అతని ఫ్రెండ్స్ తనను ఇలా మోసం చేసి డబ్బులు వసూలు చేశారని 68 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయిన నెడుమారన్ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అమ్రేష్‌ను అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అమ్రేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
ప్రభుదేవా హీరోగా నటించిన చార్లీ చాప్లిన్ 2కు అమ్రేష్ మ్యూజిక్ అందించాడు. అందులోని పాటలు పెద్ద హిట్టయ్యాయి. అంతకు ముందు మొట్ట శివ కెట్ట శివ, భాస్కర్ ఒరు రాస్కల్ లాంటి హిట్ సినిమాలకు మ్యూజిక్ సమకూర్చాడు.

![]() |
![]() |