![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో 'సలార్' మూవీ రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమాని 2022 ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని సంకల్పించారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా తొలిసారి శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రభాస్‌ను ఆమె వినయశీలి అని అభివర్ణిస్తోంది. "జెన్యూన్‌గా ఆయన సరదాగా ఉంటాడు. పాజిటివ్ పర్సన్. మనకు తెలిసిన వాళ్లలో చాలామంది వినయవంతులుగా నటిస్తుంటారు. కానీ ప్రభాస్ అలా కాదు, ఆయన జెన్యూన్‌గానే వినయవంతుడు." అని తెలిపింది.
'సలార్' మూవీ పవర్ ప్యాక్డ్ కాంబినేషన్‌తో తయారవుతున్న సినిమా అంటోందామె. "ఈ ప్రాజెక్టును 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికే ఒక పవర్ ప్యాక్ట్ కాంబినేషన్. ఈ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడే నేను రియల్‌గా ఎగ్జయిట్ అయ్యాను. అప్పటికి నేనింకా ఈ ప్రాజెక్ట్‌లోకి రాలేదు. నేను వేరే సినిమాల షూటింగ్స్‌తో ఉండగా, అకస్మాత్తుగా నాకీ ప్రాజెక్ట్ వచ్చింది. ప్రశాంత్ కథ చెప్పినప్పుడు, నిజంగా నాకు నచ్చింది. ప్రశాంత్ స్టైల్‌లో యాక్షన్, డ్రామా, ఎమోషన్ కలిసిన కథ ఇది. ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా." అని చెప్పుకొచ్చింది శ్రుతి.
తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన ముచ్చటగా మూడోసారి నటించిన 'వకీల్ సాబ్', తమిళంలో విజయ్ సేతుపతి జోడీగా నటించిన 'లాబమ్' విడుదలకు రెడీ అవుతున్నాయి.
![]() |
![]() |