![]() |
![]() |

`మగధీర` (2009)లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా కనువిందు చేసిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఎనిమిదేళ్ళ తరువాత చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి జంటగా `ఖైదీ నంబర్ 150` (2017)లో ఆడిపాడింది. రెండు సందర్భాల్లోనూ విజయాలు చూసింది. ఈ తరంలో తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసి సక్సెస్ చూసిన నాయికగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
కట్ చేస్తే.. ఇప్పుడిదే శైలిని మరో ఫ్యామిలీ విషయంలో కొనసాగించే పనిలో ఉంది కాజల్. ఆ వివరాల్లోకి వెళితే.. 2011లో విడుదలైన యాక్షన్ డ్రామా `దడ`లో యువ సామ్రాట్ నాగచైతన్యకి పెయిర్ గా దర్శనమిచ్చింది కాజల్. కాలం పదేళ్ళు పరుగులు తీశాక.. ఇప్పుడు చైతూ తండ్రి, కింగ్ నాగార్జునతో జోడీ కట్టబోతోంది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ్ కి జంటగా కాజల్ కన్ఫామ్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
మొత్తమ్మీద.. చరణ్ తో ఆడిపాడిన ఎనిమిదేళ్ళకు చిరుతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన కాజల్.. చైతూ - నాగ్ విషయంలో పదేళ్ళు గ్యాప్ తీసుకుందన్నమాట.
మరి.. చైతూకి అంతగా అచ్చిరాని కాజల్ ఫ్యాక్టర్.. నాగ్ కి అయినా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |