![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. పిరియడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టెయిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. పతాక సన్నివేశాల్లో ఎంటర్ అయ్యే ఈ క్యారెక్టర్.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని బజ్. వాస్తవానికి ఈ పాత్ర కోసం తొలుత నారా రోహిత్ ని సంప్రదించారని.. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడా పాత్రని విజయ్ దేవరకొండ చేయబోతున్నారని వినికిడి. త్వరలోనే `శ్యామ్ సింగ రాయ్`లో విజయ్ దేవరకొండ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
కాగా, ఇదివరకు నాని కథానాయకుడిగా నటించిన `ఎవడే సుబ్రమణ్యం`లో విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే రాహుల్ ప్రీవియస్ మూవీ `టాక్సీవాలా`లో విజయ్ దేవరకొండనే కథానాయకుడు. ఈ నేపథ్యంలో.. `శ్యామ్ సింగ రాయ్`లో విజయ్ అతిథి పాత్రపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది.
![]() |
![]() |