![]() |
![]() |

`ఉప్పెన`, `జాతిరత్నాలు`.. జస్ట్ నెల రోజుల గ్యాప్ లో విడుదలైన ఈ రెండు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 12న వచ్చిన `ఉప్పెన` రికార్డ్ స్థాయి వసూళ్ళు దక్కించుకోగా.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజైన `జాతిరత్నాలు` కూడా అదే బాటలో పయనిస్తోంది.
ఇదిలా ఉంటే.. `ఉప్పెన`తో డ్రీమ్ డెబ్యూ ఇచ్చిన కథానాయకుడు వైష్ణవ్ తేజ్, `జాతిరత్నాలు` రూపంలో ఘనవిజయం అందుకున్న దర్శకుడు అనుదీప్ కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్.. వైష్ణవ్ తేజ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం అనుదీప్ కి దక్కిందని టాక్. త్వరలోనే వైష్ణవ్ - అనుదీప్ కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. `ఉప్పెన` హీరోతో `జాతిరత్నాలు` దర్శకుడు చేయనున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |