![]() |
![]() |
.jpg)
2019 సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 3'. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. 'ఎఫ్ 3'లో కొన్ని కొత్త పాత్రలను జోడించే పనిలో ఉన్నారట అనిల్. అందులో భాగంగానే.. ఇప్పటికే సునీల్‌ని ఓ కీలక పాత్రకి ఎంచుకున్నారు. అంతేకాదు.. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రంలో ఆనంద్ దేవరకొండకి తండ్రిగా, కొండలరావ్ పాత్రలో జీవించేసిన గోపరాజు రమణ కూడా 'ఎఫ్ 3'లో సందడి చేయనున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వెంకీకి తండ్రిగా గోపరాజు రమణ కనిపిస్తారని తెలిసింది. త్వరలోనే 'ఎఫ్ 3'లో 'మిడిల్ క్లాస్' కొండలరావ్ (గోపరాజు రమణ) ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |