![]() |
![]() |

రెండు దశాబ్దాల క్రితం తెలుగు, తమిళ భాషల్లో నంబర్ వన్ హీరోయిన్ గా రాణించారు సిమ్రన్. పెళ్ళయ్యాక సపోర్టింగ్ రోల్స్ లోనే దర్శనమిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన 'పావ కథైగళ్' ఆంథాలజీతో మరోసారి మెస్మరైజ్ చేశారు. రీసెంట్ గా 'అంధాధున్' తమిళ్ రీమేక్ లో నెగటివ్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిమ్రన్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంతకం చేశారు.
ఆ వివరాల్లోకి వెళితే.. చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ కాంబినేషన్ లో కార్తిక్ సుబ్బరాజు ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సిమ్రన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని సిమ్రన్ అధికారికంగా ప్రకటించారు. గతంలో సిమ్రన్.. 'పితామగన్' (తెలుగులో 'శివపుత్రుడు'), 'ధ్రువ నక్షత్రమ్' చిత్రాల్లో విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 'పితామగన్' సెన్సేషన్ క్రియేట్ చేయగా.. 'ధ్రువ నక్షత్రమ్' విడుదలకు సిద్ధమైంది.
అయితే.. రెండు సినిమాల్లోనూ సిమ్రన్ హీరోయిన్ కాకపోవడం గమనార్హం. మరి.. విక్రమ్ తో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న సిమ్రన్.. ఈ సారి ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.
![]() |
![]() |