![]() |
![]() |

హిందీ చిత్రం 'మున్నా మైఖేల్'తో కథానాయికగా పరిచయమైనా.. దక్షిణాది సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా ఓ సినిమా చేస్తోంది. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామా.. 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పొంగల్ సీజన్ లో నిధి నాయికగా నటించిన సినిమా రిలీజ్ కావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది పొంగల్ కి కోలీవుడ్ లో ఆమె నటించిన 'భూమి', 'ఈశ్వరన్' చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా నిరాశజనక ఫలితాలనే అందించాయి. ఈ నేపథ్యంలో.. పవన్ కాంబో మూవీతోనైనా నిధి సంక్రాంతి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
పవన్ - క్రిష్ కాంబో చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తుండగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |