![]() |
![]() |
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతి ఒకరు. సిల్వర్ స్క్రీన్‌పై బ్యూటిఫుల్ మదర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. మధ్య వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే ఆమె, క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ, వాటికి సంబంధించిన వీడియోలు, పిక్చర్స్‌ను షేర్ చేస్తుంటారు. అంతే కాదు, మధ్య మధ్యలో తన ఫేవరేట్ సాంగ్స్‌కు డాన్స్ చేస్తూ వాటిని కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు.
లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఫ్లోర్ మీద నిల్చొని ఎగిరి వెనక ఉన్న బాక్సింగ్ రింగ్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చుంటున్న వీడియో అది. ఎప్పట్లా తన ఫేవరేట్ బ్లాక్ కలర్ ట్రాక్ సూట్‌లో ఉందామె. దానితో పాటు ఆమె పోస్ట్ చేసిన క్యాప్షన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. "Iam a result of my mistakes, my choices, my discipline, My passion, my madness. (నా తప్పుల ఫలితాన్ని నేను. నా చాయిస్‌లు, నా డిసిప్లిన్, నా అభిరుచి, నా పిచ్చి)." అనేది ఆ క్యాప్షన్.

కొద్ది రోజుల క్రితం ఆమె తన వర్కవుట్స్ టీమ్‌తో కలిసి ఉన్న కొన్ని పిక్చర్స్‌ను షేర్ చేసి, "అప్పుడప్పుడు కాకుండా స్థిరంగా చేసే పనుల నుండే మనకు విజయం లభిస్తుంది." అని క్యాప్షన్ పెట్టారు.

![]() |
![]() |